హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్ల అభివృద్ధికి రూ.30 కోట్ల నిధులు

E.G: మండపేట పట్టణ పరిధిలో రహదారుల అభివృద్ధికి రూ.30 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తెలిపారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రవాణా వ్యవస్థ ప్రక్షాళన చేసే దిశగా కొత్తగా రహదారుల నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. వివిధ ప్రాంతాల్లో ప్రధాన రహదారులకు అనుసందానం చేస్తూ కొత్త రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించినట్లు వెల్లడించారు.