PLD: నరసరావుపేట ఆర్డీవో కార్యాలయం వద్ద బుధవారం ధరల పెరుగుదలపై సీపీఐ నరసరావుపేట నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. వంటింటి ఖర్చులు పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. బ్లాక్ మార్కెట్ దళారుల దోపిడీని అరికట్టి, నిత్యావసర ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ధరల భారాన్ని తగ్గించాలని సీపీఐ నిరసన


