హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులను ఆదుకోవాలి: సీపీఎం

ASR: వర్షాభావంతో ఎండిపోతున్న వరి పొలాలకు ప్రభుత్వం వ్యవసాయ బోర్లు మంజూరు చేయాలని సీపీఎం జీకేవీధి మండల కార్యదర్శి, గాలికొండ ఎంపీటీసీ సభ్యుడు బుజ్జిబాబు డిమాండ్ చేశారు. నాట్లు వేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు. పంటలు కోల్పోయిన రైతు కుటుంబాలకు నెలకు 50 కేజీల బియ్యం ఉచితంగా అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.