హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్ హరే కృష్ణ నగర్‌లో 19 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 20వ డివిజన్ అభివృద్ధికి 7 కోట్ల 73 లక్షల రూపాయల నిధులు కేటాయించామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.