WGL: నగరంలోని హెడ్ పోస్టాఫీసు సమీపం నుంచి సీకేఎం ప్రసూతి ఆస్పత్రికి వెళ్లే మార్గంలో బుధవారం సైతం రహదారిపై మురుగు నీరునిలిచిపోయింది. డ్రైనేజీ ఉప్పొంగడంతో రహదారి అధ్వానంగా మారి గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. జీడబ్ల్యూఎంసీ అధికారులు వెంటనే స్పందించి మురుగునీటిని తొలగించాలని, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: హెడ్ పోస్టాఫీసు వద్ద నిలిచిన మురుగునీరు


