హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు

BHPL: చిట్యాల మండలంలోని గ్రామ పంచాయతీలో బుధవారం తెలంగాణ ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ తౌటం లక్ష్మి అంతయ్య, కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ,కాళోజీ ప్రజా సేవలు, సాహిత్య కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సర్పంచ్ పేర్కొన్నారు.