హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టరేట్‌లో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు

కామారెడ్డి కలెక్టరేట్‌లో బుధవారం ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ విక్టర్ కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తన రచనలు, పోరాటాల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసిన గొప్ప మహనీయుడు కాళోజీ అని ఆయన సేవలను కొనియాడారు. తెలంగాణ భాషా సాంస్కృతిక వికాసానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.