హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తుగ్గలిలో తాగునీటి సరఫరాపై ఆగ్రహం!

KRNL: తుగ్గలి మండలం రాతనలో కుళాయిల ద్వారా సరఫరా అవుతున్న తాగునీటిలో తెల్లటి పురుగులు, చెత్త వస్తుండటంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. కలుషిత నీటిని తాగడంతో చిన్నారులు, వృద్ధులు వాంతులు, విరేచనాలు, చర్మ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి సురక్షిత నీరు అందించాలని కోరుతున్నారు.