హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పింఛన్ల కుంభకోణం.. సహాయకుడు సస్పెండ్..!

ఏలూరు: జిల్లా కుక్కునూరు మండలం వేలేరు గ్రామ సచివాలయంలో పింఛన్ల సొమ్ము రూ. 21 లక్షలు దుర్వినియోగం చేసిన సంక్షేమ సహాయకుడు శ్రీధర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. జూలై నెల మిగులు నిధులను డీఆర్‌డీఏకు జమ చేయలేదని, ప్రస్తుతం రూ.12.50 లక్షలు రికవరీ చేసినట్లు పీడీ విజయలక్ష్మి బుధవారం వెల్లడించారు.