హైదరాబాద్: 28°C
తెలంగాణ

తహసీల్దార్ కార్యాలయంలో కాళోజీ జయంతి వేడుకలు

WGL: నల్లబెల్లి తహసీల్దార్ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని ఘనంగా నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ముప్పు కృష్ణ మాట్లాడుతూ.. తెలంగాణ భాష, సంస్కృతి కోసం కాళోజీ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. అన్యాయంపై ఆయన చేసిన పోరాటం యువతకు ఆదర్శమని పేర్కొన్నారు.