హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: డప్పు కళాకారులకు 12 డప్పుల పంపిణీ

BHPL: గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామంలో ఒద్దుల లక్ష్మి, పెద్దరాజిరెడ్డిల జ్ఞాపకార్థం డప్పు కళాకారులకు 12 డప్పులను పంపిణీ చేశారు. మాజీ సర్పంచ్ ఒద్దుల విజయ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వీరమల్ల సంపత్ రెడ్డి పాల్గొన్నారు. డప్పు కళాకారులను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ సంప్రదాయాలను పరిరక్షించాలని అశోక్ అన్నారు.