JN: దేవరుప్పుల మండలం కోలుకొండ ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం నిర్వహించిన స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రాంలో పాల్గొని విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యార్థులకు నేల ఆరోగ్యంపై పలు అంశాలను వివరించి అవగాహన కల్పించారు. నేల ఆరోగ్యం, పర్యావరణం కాపాడటానికి అందరూ కృషి చేయాలన్నారు.
తెలంగాణ
ప్రభుత్వ పాఠశాలను పరిశీలించిన కలెక్టర్


