హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం బంద్!

NDL: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. తెలంగాణలోని ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి కొనసాగుతుండటంతో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. మంగళవారం రాత్రికి నీటిమట్టం 867.50 అడుగులు, నిల్వ 131.8508 టీఎంసీలుగా నమోదైంది.