హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి సేవలో ఎమ్మెల్యే మల్లారెడ్డి

TPT: తిరుమల శ్రీవారిని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తన 73వ పుట్టిన రోజు సందర్భంగా ఇవాళ దర్శించుకున్నారు. వయోభారాన్ని పక్కన పెట్టి మోకాళ్ల పర్వతంపై మోకాళ్లతో మెట్లెక్కి అందరినీ ఆశ్చర్యపరిచారు. అనంతరం కాలినడకన ఆలయానికి చేరుకుని స్వామివారి సేవలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.