హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామయ్యను దర్శించుకున్న కేంద్ర మంత్రి

BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బుధవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలుకగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో దేవస్థానం వేద పండితులు వేదాశీర్వచనం అందజేయగా దేవస్థానం ఈవో దామోదర్ రావు దేవస్థానం తరపున జ్ఞాపికను అందజేశారు.