హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్‌వాడీ కార్యకర్తల ముందస్తు అరెస్ట్‌

BDK: మణుగూరు మండలంలో బుధవారం ‘చలో హైదరాబాద్‌’ ఆందోళనకు బయలుదేరుతున్న అంగన్‌వాడీ కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టులకు సీఐటీయూ నాయకులు గద్దల శ్రీనివాస్‌, సాంబశివరావు తీవ్రంగా ఖండించారు. సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా ఆందోళనకు వెళ్తుండగా అరెస్టులు చేయడం సరికాదని సీఐటీయూ నాయకులు అన్నారు.