హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ముస్లింపాలెంలో ఒరిగిన విద్యుత్ స్తంభం

NLR: సంగం మండలం దువ్వూరు గ్రామంలోని ముస్లిం పాలెం వీధిలో రాత్రి గుర్తుతెలియని వాహనం తగలడంతో విద్యుత్‌ వైర్లు తెగిపోయాయి. దీంతో ఆ వీధిలో విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెగిపోయిన విద్యుత్‌ వైర్లు వేలాడుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.