హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంట్లో నాగుపాము కలకలం

VSP: జిల్లాలోని గోపాలపట్నంలోని ఓ ఇంట్లో కమోడ్ వద్ద సుమారు ఆరడుగుల నాగుపాము కనిపించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అది పడగవిప్పి బుసలు కొడుతుండటంతో వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు.పెందుర్తికి చెందిన సునీల్ బృందం చాకచక్యంగా పామును పట్టుకుని సురక్షితంగా తరలించడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.