హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలిలో పారిశుద్ధ్య పనులపై కమిషనర్‌ ఆరా

GNTR: తెనాలి పట్టణంలోని బస్టాండ్‌ ప్రాంతంతో పాటు పలు చోట్ల జరుగుతున్న పారిశుద్ధ్య పనులను మున్సిపల్‌ కమిషనర్‌ రామా అప్పలనాయుడు పరిశీలించారు. పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు, సిబ్బందిని ఆదేశించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని, కాలువల్లో చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.