కడప: జిల్లా కొప్పర్తి పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అక్కడి ఓ పరిశ్రమలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. అప్రమత్తమైన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
కొప్పర్తి పరిశ్రమలో అగ్నిప్రమాదం


