RR: షాద్‌నగర్ పురపాలక సంఘం పరిధిలోని 5వ వార్డులో బోరు మోటర్ చెడిపోవడంతో గత పది రోజుల నుంచి తాగునీరు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ సిబ్బందికి ఎన్నిసార్లు విన్నవించినా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి పాడైన మోటర్‌కు మరమ్మతులు చేసి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
'తాగునీటి సమస్యను పరిష్కరించాలి'


