హైదరాబాద్: 28°C
వ్యాపారం

భారీగా తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,040 తగ్గి రూ.1,54,310గా ఉండగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.950 తగ్గి రూ.1,41,450 వద్ద కొనసాగుతోంది. మరోవైపు, కిలో వెండి ధర రూ.2,54,900 వద్ద కొనసాగుతోంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు అమలవుతున్నాయి.