హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు ఇబ్బందులు కలగొద్దు: అదనపు కలెక్టర్

మెదక్ జిల్లాలో వానాకాలం 2026 ధాన్యం నిల్వ కోసం కొత్త గోదాముల నిర్మాణానికి అనువైన స్థలాలను త్వరగా పరిశీలించాలని అదనపు కలెక్టర్ నగేష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సివిల్ సప్లై, వ్యవసాయ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు పకడ్బందీగా జరపాలన్నారు.