హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులకు సిజేరియన్లు

ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులకు సిజేరియన్లు ప్రారంభం అయ్యాయి. డిప్యూటేషన్‌పై వచ్చిన గైనకాలజిస్టులు నందిని, కావ్యలు ఇద్దరు గర్భిణులకు అత్యవసర పరిస్థితుల్లో సిజేరియన్లు చేశారని DCH డాక్టర్ కిరణ్ ప్రకటనలో వెల్లడించారు. డెలివరీలకు అవసరమైన వైద్య సదుపాయాలు, పరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.