ప్రకాశం జిల్లాలో మంగళవారం ఏపీ ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయ్ ప్రతాప్‌రెడ్డి పర్యటించారు. మర్రిపూడి, కొండపి, సింగరాయకొండ ప్రాంతాల్లోని అంగన్‌వాడీలు, పాఠశాలలు, హాస్టళ్లలో భోజన నాణ్యతను పరిశీలించారు. కూచిపూడి హైస్కూల్‌లో భోజన నాణ్యతపై ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. రేషన్ పంపిణీలో అవకతవకలకు తావులేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో పర్యటించిన ఫుడ్ కమిషన్ ఛైర్మన్.!


