హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థుల కోసం బస్సు సౌకర్యం కల్పించాలి'

MDK: రామాయంపేట మండలం దంతేపల్లి, పర్వతాపూర్, కాట్రియాల్ గ్రామాలకు బస్సు సౌకర్యం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు సమయానికి రవాణా సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి ఆయా గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు, గ్రామస్థులు కోరుతున్నారు.