ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఓపీ విధులకు హాజరుకాకుండా నిర్లక్ష్యం వహిస్తున్న 32 మంది వైద్యులకు మెడికల్ సూపరింటెండెంట్ నరేందర్ మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సమయపాలన పాటించకుండా రోగులను ఇబ్బంది పెడుతున్నారనే ఫిర్యాదులపై విచారణ జరిపి ఈ చర్యలు తీసుకున్నారు. వీరంతా మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని,లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది.
తెలంగాణ
32 మంది వైద్యులకు షోకాజ్ నోటీసులు.!


