హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిత్యావసర ధరలు తగ్గించాలి: సీపీఐ

అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లి మూడు రోడ్ల కూడలిలో బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో నిత్యావసర ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ధరలు వెంటనే తగ్గించాలని, బ్లాక్‌ మార్కెట్‌, దళారీ వ్యవస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ళ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి కొమ్ము ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.