హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణపతి నవరాత్రులు శాంతియుతంగా జరుపుకోవాలి: SI

JN: గణపతి నవరాత్రులను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్ సూచించారు. మండపాల ఏర్పాటుకు తెలంగాణ పోలీస్ శాఖ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మండపాల పూర్తి బాధ్యత నిర్వాహకులదేనని తెలిపారు. అత్యవసర వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని, డీజేలకు అనుమతి లేదని, రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లు వినియోగించాలన్నారు.