హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసు సిబ్బందికి ప్రత్యేక యోగా సాధన

ATP: జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు బుధవారం ఏఆర్ పోలీసు సిబ్బందికి ప్రత్యేక యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. హెడ్ కానిస్టేబుల్ చలపతి సిబ్బందితో ఆసనాలు, ప్రాణాయామం చేయించి యోగా ఉపయోగాలను వివరించారు. దైనందిన జీవితంలో యోగా ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా పాల్గొన్నారు.