హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నర్సీపట్నంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

AKP: నర్సీపట్నంలో నేడు జయహో బిసి భారీ బహిరంగ సభ జరుగుతున్న నేపథ్యంలో పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు టౌన్ సిఐ షేక్ గఫూర్ తెలిపారు. సభ కోసం వచ్చే వాహనాలు ఐదు రోడ్లు జంక్షన్, తుని రోడ్డు మీదగా బైపాస్ చేరుకోవాలని అన్నారు. చింతపల్లి వైపు నుంచి వచ్చే వాహనాలు పాత మున్సిపల్ ఆఫీస్, పెద్ద చెరువు, బైపాస్ మీదుగా రావాలన్నారు.