ప్రకాశం: బేస్తవారిపేట మండలంలో సీఐ మల్లికార్జున మంగళవారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో రాత్రి బస చేసి స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామంలో శాంతిభద్రతలు, ప్రజల భద్రతకు సంబంధించిన అంశాలపై స్థానికులతో చర్చించారు. సైబర్ మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఐ


