కోనసీమ: మండపేట పురపాలక సంఘం పరిధిలో రహదారుల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్ల నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తెలిపారు. టిడ్కో అపార్ట్‌మెంట్స్ అనుసంధాన రహదారులు, నేలటూరు మార్గం, బైపాస్ రోడ్లు సహా అన్ని వార్డుల్లోని ప్రధాన రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. నిధుల మంజూరుకు సహకరించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్ల అభివృద్ధికి భారీ నిధులు


