హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాళ్లు తేలిన రోడ్డుతో గిరిజనులు అవస్థలు

PPM: జియ్యమ్మవలస మండలం లో కొండచిలకాం పంచాయతీ ద్రాక్షిణి గిరిశిఖర గ్రామానికి రహదారి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారి నుంచి 2.60 కి.మీ. మేర రోడ్డు అధ్వానంగా రాళ్లు తేలి ఉండటంతో అత్యవసర వేళల్లోనూ కాలినడకనే వెళ్లాల్సి వస్తోంది. అంబులెన్స్ కూడా గ్రామానికి చేరలేని పరిస్థితి నెలకొంది. వెంటనే రహదారి నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.