CTR: చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో గుర్తుతెలియని వ్యక్తులు నవజాత శిశువును వదిలి వెళ్లారు. గమనించిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే శిశువును సంరక్షణలోకి తీసుకుని, మెరుగైన వైద్యం కోసం SNCU (ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగం)కు తరలించారు. ఈ ఘటనపై అధికారులు ఆరా తీస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
నవజాత శిశువును వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు


