MLG: ములుగు మండలం జాకారం గ్రామంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మణుగూరు నుంచి హనుమకొండ వెళ్తున్న బస్సు బైక్‌ను ఢీకొనడంతో వ్యవసాయదారుడు గండ్రోత్ దామోదరుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న బస్సు


