హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రత్తిపాడులో కాలిబూడిదైన కారు

GNTR: ప్రత్తిపాడుకు చెందిన చేరెడ్డి శ్రీనివాసరావు ఇంటి వద్ద నిలిపి ఉంచిన కారు అకస్మాత్తుగా అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా కాలిపోయింది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఆయన అల్లుడు పుసులూరి దిలీప్‌కు చెందిన కారును ఇంటి బయట పార్క్ చేయగా ఈ ప్రమాదం జరిగింది. శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై నరహరి మంగళవారం తెలిపారు.