హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రొద్దుటూరులో సచివాలయ ఉద్యోగుల ర్యాలీ

KDP: ప్రొద్దుటూరులో మంగళవారం సచివాలయ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ.. ఆత్మ ఘోష ర్యాలీ నిర్వహించారు. సచివాలయ ఉద్యోగుల పట్ల ప్రభుత్వ తీరును నిరసిస్తూ ర్యాలీ చేపట్టారు. తమకు రావాల్సిన ఏఏఎస్, డీఏలు మంజూరు చేయడంతో పాటు ప్రమోషన్ ఛానల్ కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ గాంధీ పార్కులోని మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.