హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంగతాయి జూదం.. ఆరుగురు అరెస్ట్

అన్నమయ్య: గాలివీడు మండలంలోని ఆరవీడు గ్రామం రెడ్డివారిపల్లి, పేరంపల్లి గ్రామంలోని ఇడపలచేనుపల్లె వద్ద పోలీసులు దాడులు నిర్వహించారు. డబ్బులు పణంగా పెట్టి మంగతాయి జూదం ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 11,320 నగదు, 5 సెల్‌ఫోన్లు, 3 మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై గాలివీడు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.