హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మండపాలకు అనుమతులు తప్పనిసరి: కమిషనర్

KDP: ప్రొద్దుటూరులో వినాయక ఉత్సవాల కమిటీల వారు ఈ నెల 12వ తేదీలోపు మండపాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్ సూచించారు. మున్సిపల్ కార్యాలయంలో పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక, విద్యుత్, R&B అధికారులు ,సంఘాల ప్రతినిధులతో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.