కోనసీమ: రామచంద్రపురం మండలంలో గణేశ్ మండపాల ఏర్పాటుకు పోలీసు అనుమతి తప్పనిసరి అని SI నాగేశ్వరరావు స్పష్టం చేశారు. నిర్వాహకులు ganeshutsav.net వెబ్సైట్లో సింగిల్ విండో విధానం ద్వారా ఉచితంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అధికారులు ఇచ్చే NOC, QR కోడ్‌ను మండపంలో ఉంచాలని, నిమజ్జనం వరకు CC కెమెరాలు ఏర్పాటు చేసి ఉత్సవాలు ప్రశాంతంగా జరపాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'మండపాల్లో CC కెమెరాలు తప్పనిసరి'


