హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

కుక్కుటాసనం వల్ల కలిగే ప్రయోజనాలు

కుక్కుటాసనం సంస్కృతంలో 'కుక్కుట' అంటే కోడి అని అర్థం. ఈ ఆసనం వేసినప్పుడు శరీరం కోడి ఆకారాన్ని పోలి ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. పొత్తికడుపు భాగంపై ఒత్తిడి పడటం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. మలబద్ధకం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. జఠరాగ్ని(జీర్ణశక్తి) ఉత్తేజితమై ఆకలి బాగా వేస్తుంది. శరీరాన్ని ఒకేచోట స్థిరంగా ఉంచడం వల్ల శారీరక సమతుల్యత, ఏకాగ్రత పెరుగుతాయి.