హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు నర్సీపట్నంలో జయహో బీసీ సభ

AP: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఇవాళ జయహో బీసీ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ స్టేడియంలో మ.3 నుంచి రాత్రి 7 గంటల వరకు సభ జరగనుంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు సభ ఏర్పాటు చేశారు. పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేయనున్నారు. కూడళ్లలో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. రోడ్డుకు ఇరువైపులా పసుపురంగు జెండాలు, బీసీ నేతల కటౌట్లు పెట్టారు.