హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గంపలగూడెం పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏసీపీ

NTR: గంపలగూడెం పోలీస్‌స్టేషన్‌ను ఏసీపీ రామచంద్రరావు, సీఐ గురు ప్రకాష్ తనిఖీ చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా స్టేషన్ రికార్డులను పరిశీలించి, సిబ్బందితో సమావేశమై శాంతిభద్రతల పరిరక్షణపై సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో రాత్రివేళ గస్తీ పెంచాలని, సీసీ కెమెరాల ఏర్పాటుపై, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఏసీపీ ఆదేశించారు.