హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరుస బైక్‌ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్‌

BDK: భద్రాచలం మండలంలో మంగళవారం వాహన తనిఖీల్లో గుగులోత్‌ శ్రీను పట్టుబడ్డాడు. విచారణలో భద్రాచలం, దుమ్ముగూడెం ప్రాంతాల్లో బైక్‌లు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి నాలుగు మోటార్‌ సైకిళ్లను స్వాధీనం చేసుకుని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వాహనాల భద్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ అరుణ్‌కుమార్‌ సూచించారు.