MBNR: జిల్లా కేంద్రంలో డెంగ్యూ బారిన పడిన బాధితులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీనివాసులు మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితుల ఇంటి పరిసరాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజలు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఇంటి చుట్టూ నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. నీరు నిలువ ఉంటే దోమల వ్యాప్తి పెరుగుతుందన్నారు.
తెలంగాణ
డెంగ్యూ వ్యాధిగ్రస్తులను పరామర్శ


