గుండెపోటు వచ్చే ముందు శరీరం కొన్ని హెచ్చరిక సంకేతాలు ఇస్తుంది. ఛాతిలో తీవ్రమైన నొప్పి లేదా బిగుతుగా అనిపించడం, ఈ నొప్పి ఎడమ చేతికి, దవడ లేదా వీపుకు పాకడం ప్రధాన లక్షణాలు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండానే విపరీతమైన చెమట పట్టడం, ఊపిరి ఆడకపోవడం, వికారం, తల తిరగడం లేదా ఒక్కసారిగా నీరసంగా అనిపించడం జరుగుతుంది. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ఆరోగ్యం
గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలు!


