ఆకుకూరల్లో పొన్నగంటి కూర పోషకాల నిధి అని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఐరన్, కాల్షియం, బీటా కెరోటిన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు రక్తహీనతను తగ్గిస్తుంది. విటమిన్ ఎ మెండుగా ఉండటం వల్ల కంటిచూపు మెరుగుపడటమే కాకుండా కంటిపై పడే ఒత్తిడి తగ్గుతుంది. అలాగే జీర్ణవ్యవస్థను మెరుగుపరచి, చెడు కొలెస్ట్రాల్‌ను అడ్డుకోవడంలోనూ మంచి పాత్ర పోషిస్తుంది.
ఆరోగ్యం
పొన్నగంటి కూర పోషకాల నిధి


