హైదరాబాద్: 28°C
తెలంగాణ

నవజాత శిశువు మృతదేహం లభ్యం

MDCL: కూకట్‌పల్లిలోని లోటస్‌ ఆసుపత్రి సమీపంలోని డ్రైనేజీలో నవజాత శిశువు మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. కొద్ది రోజులుగా డ్రైనేజీ బ్లాక్‌ కావడంతో మున్సిపల్‌ సిబ్బంది మ్యాన్‌హోల్‌ తెరిచి శుభ్రం చేస్తుండగా ఈ ఘటన వెలుగుచూసింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.