హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మట్టి వినాయక ప్రతిమలనే పూజిద్దాం'

VSP: ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో వినాయక ప్రతిమలు తయారు చేయవద్దని గ్రీన్‌ క్లైమేట్‌ టీం వ్యవస్థాపక కార్యదర్శి జె.వి.రత్నం పిలుపునిచ్చారు. మంగళవారం పెదవాల్తేరు కేడీపీఎం హైస్కూల్లో మట్టి వినాయక ప్రతిమల తయారీ కార్యక్రమం నిర్వహించారు. మట్టి, పసుపు, బియ్యంపిండితో ప్రతిమలు తయారు చేయాలని హెచ్‌ఎం సుమతిబాయి సూచించారు.21 పత్రి మొక్కలు నాటి వనాలు పెంచాలని సూచించారు.